భారతదేశం, మే 7 -- Sai Pallavi: నేచురల్ స్టార్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సౌత్ ఇండియాలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ స్టార్ హీరోయిన్.. తాజాగా 'ఏక్ దిన్' (Ek Din) సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. గత శుక్రవారమే (మే 1) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ రొమాంటిక్ డ్రామాకు బాక్సాఫీస్ దగ్గర మిక్స్ డ్ రియాక్షన్ వచ్చింది.

ఏక్ దిన్ మూవీ చేయడంపై సాయి పల్లవి ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది. మూవీలో తన కో-స్టార్ జునైద్ ఖాన్‌తో కలిసి జరిపిన చిట్ చాట్‌లో సాయి పల్లవి ఈ ప్రాజెక్ట్‌ను ఎందుకు ఎంచుకుందో వివరించింది. జునైద్ ఖాన్‌తో మాట్లాడిన వీడియోను 'అమీర్ ఖాన్ టాకీస్' యూట్యూబ్ ఛానెల్‌లో విడుదల చేశారు. ఇప్పటికే పలు భాషల్లో భారీ చిత్రాలు చేస్తున్న మీరు, ఈ చిన్న సినిమాకు ఎలా ఓకే చెప్పారు? అని జునైద్ అడగగా సాయి పల్లవి ఆసక్త...