భారతదేశం, మార్చి 15 -- ప్రజ్వల లైన్ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రియదర్శి, ద్రిషిక చందర్ హీరో హీరోయిన్‌గా నటించిన సినిమా సుయోధన. ఈ మూవీలో డైలాగ్ కింగ్ సాయికుమార్, సీనియర్ హీరోయిన్ ప్రేమ కీలకపాత్రల్లో నటించారు. వై ఎస్ మాధవ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని బోసుబాబు నిడుమోలు నిర్మించారు.

అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న సుయోధన సినిమా ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. పలు హిట్ చిత్రాలను రిలీజ్ చేసిన శ్రీ లక్ష్మి పిక్చర్స్ సంస్థ "సుయోధన" సినిమాను విడుదల చేస్తోంది.

తాజాగా ఇవాళ (మార్చి 15) సుయోధన టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా సుయోధన రిలీజ్ లాంచ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యంగ్ హీరో, సీనియర్ హీరోయిన్‌పై నటుడు సాయి కుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

యాక్టర్ సాయికుమార్ మాట్లాడుతూ...