భారతదేశం, మార్చి 24 -- Sabdham OTT: గతేడాది వచ్చిన ఆది పినిశెట్టి తమిళ హారర్ థ్రిల్లర్ సినిమా శబ్దం ఇప్పుడు స్ట్రీమింగ్‌కు రెడీ అయిపోయింది. థియేటర్లలో రిలీజ్ అయిన ఏడాదికి పైగా లాంగ్ గ్యాప్ తర్వాత ఈ సినిమా జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే కేవలం తమిళం ఆడియోతోనే రావడంతో తెలుగు ప్రేక్షకులు నిరాశ చెందుతున్నారు.

హారర్ సినిమాలను ఇష్టపడే ఫ్యాన్స్ కోసం ఈ వారం తమిళ ఓటీటీ రిలీజ్‌లలో గతేడాది వచ్చిన హారర్ థ్రిల్లర్ శబ్దం కూడా చేరిపోయింది. డైరెక్టర్ అరివళగన్ తీసిన ఈ సినిమాలో ఆది పినిశెట్టి మెయిన్ లీడ్‌గా చేశాడు. ఫిబ్రవరి 2025లో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా, రిలీజైన ఏడాది తర్వాత ఇప్పుడు జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతానికి ఇది కేవలం తమిళ ఆడియోలో మాత్రమే అందుబాటులో ఉంది.

ఇంతకుముందు ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ఈరమ్ సినిమా తర్వాత, ఆది పినిశెట్టి ...