భారతదేశం, నవంబర్ 16 -- Sabarimala Special Trains : శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే తెలుగు రాష్ట్రాల భక్తులకు దక్షిణ రైల్వే అలర్ట్ అందించింది. ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు, మరీ ముఖ్యంగా అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం చర్లపల్లి - కొల్లం - చర్లపల్లి మధ్య ప్రత్యేక వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లను (రైలు నంబర్లు 07180 / 07181) నడపాలని నిర్ణయించింది. నవంబర్ 20 నుంచి డిసెంబర్ 27, 2026 వరకు మొత్తం 12 సర్వీసులు (ఇరువైపులా ఆరేసి ట్రిప్పులు) ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి.

ఈ ప్రత్యేక రైలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని మొత్తం 30 స్టేషన్లలో ఆగుతూ ప్రయాణిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన స్టాపుల విషయానికొస్తే.. చర్లపల్లి తర్వాత నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు స్ట...