భారతదేశం, జూన్ 19 -- Runanubandham Serial TV Premiere Date And Time: తెలుగు బుల్లితెరపై వైవిధ్యమైన కుటుంబ కథాచిత్రాలు, ఎమోషనల్ డ్రామాలతో అగ్రగామిగా దూసుకుపోతున్న జీ తెలుగు ఛానల్ మరో సరికొత్త ప్రయోగానికి తెరలేపింది.

ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్‌తో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ ఛానల్ ఇప్పుడు సరికొత్త కథ, ఉత్కంఠభరితమైన మలుపులతో సాగే 'రుణానుబంధం' అనే సీరియల్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది. జూన్ 22వ తేదీ నుంచి ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు రోజువారీ ప్రైమ్ టైమ్ స్లాట్ అయిన రాత్రి 7 గంటలకు ఈ సరికొత్త ధారావాహిక ప్రసారం కానుంది.

సాధారణంగా రాత్రి 7 గంటల సమయం అంటే ఛానళ్ల మధ్య రేటింగ్స్ యుద్ధం నడుస్తుంది. ఈ కీలక సమయంలో జీ తెలుగు ఒక విభిన్నమైన సెంటిమెంట్ కథను నమ్ముకుని బరిలోకి దిగుతుండటం విశేషం.

ఈ సీరియల్ కథాంశం చాలా భిన్నంగా, తెలుగు రా...