RTC Bus Fares : దసరా వేళ ఆర్టీసీ ఛార్జీల బాదుడు - రేవంత్ ప్రభుత్వంపై హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం!
భారతదేశం, అక్టోబర్ 18 -- బతుకమ్మ, దసరా పండుగల వేళ స్వగ్రామాలకు వెళ్లే సామాన్య, మధ్యతరగతి ప్రజలపై తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ తీవ్ర భారం మోపుతున్నాయని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. పండుగ పూట ప్రజలకు ఉపశమనం కలిగించే కానుకలు ఇవ్వాల్సింది పోయి.. టికెట్ ధరలను ఏకంగా రెట్టింపు చేసి నిలువుదోపిడీకి పాల్పడుతుండటం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీస్తూ హరీశ్ రావు పోస్ట్ చేశారు. పండుగల వేళ సాధారణంగా నడిచే రెగ్యులర్ బస్సుల సంఖ్యను కావాలనే తగ్గించి. వాటికే 'స్పెషల్' బోర్డులు తగిలించి ప్రయాణికుల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది స్పష్టంగా జేబులకు చిల్లులు పెట్టే దుర్మార్గమైన చర్య అని దుయ్యబట్టారు.
"జేబీఎస్ (JBS) నుంచి కరీంనగర్కు స...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.