భారతదేశం, జూలై 5 -- నల్గొండ జిల్లాలో ఇవాళ తెల్లవారుజామున అత్యంత విషాదకర ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామం వద్ద ఉన్న జాతీయ రహదారి(విజయవాడ హైవే)పై ప్రయాణిస్తున్న ఒక కారును ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి అత్యంత బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఎనిమిదేళ్ల చిన్నారితో సహా నలుగురు వ్యక్తులు ఘటనా స్థలంలోనే దుర్మరణం పాలయ్యారు.

స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితులు ప్రయాణిస్తున్న కారు విజయవాడ వైపు నుంచి హైదరాబాద్ మార్గంలో వెళ్తోంది. పెద్దకాపర్తి స్టేజీ సమీపంలోకి రాగానే వేగంగా దూసుకొచ్చిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నియంత్రణ కోల్పోయి కారును వెనుక భాగం నుంచి బలంగా గుద్దింది. ఈ ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా నలిగిపోయి ముక్కలైంది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఐదుగురు ఉన్నారు....