భారతదేశం, ఏప్రిల్ 12 -- ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా కీసర టోల్ గేట్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. అతను ప్రయాణిస్తున్న బీఎండబ్ల్యూ కారుపై గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడటమే దీనికి కారణం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..

నివేదికల ప్రకారం.. ఎన్టీఆర్ జిల్లా కీసర టోల్‌ప్లాజా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో న్యాయవాది బి.శ్రీనివాసరావు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. అతివేగంతో వచ్చిన గ్యాస్ ట్యాంకర్ డివైడర్‌ను ఎక్కి, శ్రీనివాసరావు ప్రయాణిస్తున్న బీఎండబ్ల్యూ కారుపై బోల్తా పడింది. దీంతో వాహనం పూర్తిగా నలిగిపోయింది... నుజ్జు.. నుజ్జు అయింది. ఐదు క్రేన్ల సహాయంతో అతికష్టం మీద ట్రక్కును పక్కకు తొలగించి మృతదేహాన్ని వెలికితీశారు.

హైదరాబాద్ వైపు వెళ్తున్న ట్యాంకర్ డ్రైవర్ బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో వాహనంపై నియంత్రణ...