భారతదేశం, జూన్ 23 -- భారతీయుల భోజనంలో అన్నం, చపాతీ (రోటీ) అత్యంత ముఖ్యమైన భాగం. అయితే, బరువు తగ్గాలని నిర్ణయించుకోగానే చాలా మంది మనసులో మెదిలే మొదటి ప్రశ్న: "అన్నం మానేసి చపాతీలు తినడం మొదలుపెట్టాలా?" అని. సాధారణంగా అన్నం తింటే లావు అవుతారని, చపాతీలు తింటే బరువు తగ్గుతారని చాలా మంది బలంగా నమ్ముతుంటారు. కానీ, న్యూట్రీషియన్ సైన్స్ ప్రకారం చూస్తే అసలు నిజాలు వేరేలా ఉన్నాయి! ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసాలను, ఏది ఆరోగ్యానికి మంచిదనే విషయాలను ప్రముఖ డైటీషియన్, సర్టిఫైడ్ డయాబెటిస్ ఎడ్యుకేటర్ డాక్టర్ అర్చన బాత్రా క్లియర్​గా వివరించారు.

"అన్నం, చపాతీ.. ఈ రెండింటిలో ఇదొక్కటే గొప్పదని ఖచ్చితంగా చెప్పలేం. మీరు ఎంచుకునే ఆహారం మీ శరీరం, జీవనశైలి, రోజూ తీసుకునే ఇతర ఆహార పదార్థాలపై ఆధారపడి ఉంటుంది," అని డాక్టర్ అర్చన బాత్రా పేర్కొన్నారు.

సాధారణంగా చపా...