భారతదేశం, అక్టోబర్ 4 -- RGV Chuttamalle Song: 'దేవర' చిత్రంలోని 'చుట్టమల్లే' పాటను ఆధారంగా చేసుకుని నటి జాన్వీ కపూర్ ఏఐ డీప్‌ఫేక్ వీడియోను సృష్టించిన వ్యవహారం టాలీవుడ్‌లో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై సెన్సేషనల్ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ (RGV) చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట సరికొత్త దుమారాన్ని రేపుతోంది.

జాన్వీ కపూర్ ఏఐ వీడియో వివాదంపై రామ్‌గోపాల్ వర్మ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తనదైన శైలిలో స్పందించారు. ఈ విషయంలో సెలబ్రిటీలందరూ సాధించింది ఒక్కటేనని, అది ఆ నీచమైన వీడియో లింక్‌కు విపరీతమైన ప్రచారం కల్పించి, కోట్లాది మంది ఆ వీడియోను చూసేలా చేయడమేనని ఆర్జీవీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆర్జీవీ ట్వీట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

''సెలబ్రిటీలందరూ సాధించిన ఒకే ఒక్క విజయం ఏంటంటే, ఆ వివాదాస్పద లింక్‌ను బాగా ప్రచారం చేసి, దానివల్ల కోట్ల మంద...