భారతదేశం, మే 2 -- టెన్త్ పూర్తి కాగానే అత్యుత్తమ ప్రమాణాలతో ఇంజినీరింగ్ వైపు చదివేందుకు గోల్డెన్ ఛాన్స్ మీకోసం ఎదురుచూస్తోంది. ఏపీలోని నూజివీడు, ఆర్.కె వ్యాలీ, ఒంగోలు, శ్రీకాకుళం క్యాంపస్‌లలో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశ ప్రక్రియ షెడ్యూల్ ఖరారైంది.

ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు 4 శాతం 'డిప్రివేషన్ స్కోర్' అదనంగా కలిపి ప్రాధాన్యతనిస్తారు. అంటే పదో తరగతిలో విద్యార్థులు సాధించిన మార్కులకు అదనంగా 4 శాతం మార్కులు కలుపుతారు.

మొదటి రెండేళ్లు పీయూసీ (PUC) (M.P.C / M.Bi.P.C), ఆ తర్వాత నాలుగేళ్లు బీటెక్ ఉంటుంది. విద్యార్థులు కావాలనుకుంటే పీయూసీ తర్వాత బయటకు వెళ్లవచ్చు.

పదో తరగతిలో సాధించిన మార్కుల (GPA) ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంది. వయస్సు: 2026లో పదో తరగతి పూర్తి చేసిన వారై ఉండాలి. పోటీ ఏర్పడితే వయసులో పెద్దవారికి ప్రాధాన్...