భారతదేశం, సెప్టెంబర్ 19 -- ఆంధ్రప్రదేశ్‌లో నివాస ధ్రువీకరణ పత్రాల (Residence Certificate) మంజూరు విధానంపై ప్రజల్లో నెలకొన్న గందరగోళానికి రెవెన్యూ శాఖ క్లారిటీ ఇచ్చింది. సాధారణ పౌరులు నివాస ధ్రువీకరణ కోసం ప్రతిసారీ తహశీల్దార్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో జారీ చేసిన ఆదేశాలను సవరిస్తూ జీఓ 592లో కీలక మార్పులు చేసింది. ఈ సవరణతో ప్రజలకు ఇబ్బందలు తప్పనున్నాయి.

పౌరుల వద్ద ఉన్న ఆధార్ కార్డు, రేషన్ కార్డుల్లో నమోదైన చిరునామానే అధికారిక నివాస ధ్రువీకరణగా పరిగణిస్తారు. వీటి ఆధారంగానే అన్ని రకాల ప్రభుత్వ విధులను, సేవలను పొందేందుకు వెసులుబాటు కల్పించారు. ఆధార్ లేదా రేషన్ కార్డు ఉన్న సామాన్య ప్రజలు ప్రత్యేకంగా తహశీల్దార్ ఆఫీస్ నుండి రెసిడెన్స్ సర్టిఫికెట్ పొందాల్సిన అవసరం లేదని రెవెన్...