Renault Duster mileage : క్రెటా, సెల్టోస్ కంటే.. రెనాల్ట్ డస్టర్ మైలేజే ఎక్కువ!
భారతదేశం, జూన్ 7 -- భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఒకప్పుడు కాంపాక్ట్ ఎస్యూవీ ట్రెండ్‌కు ఊపిరి పోసిన మోడల్ 'రెనాల్ట్ డస్టర్' ఇప్పుడు సరికొత్తగా రీ-ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు.. డస్టర్ టర్బో టీసీఈ 100 మోడల్‌కు సంబంధించిన అధికారిక మైలేజ్ వివరాలను కంపెనీ వెల్లడించింది. ఏఆర్ఏఐ సర్టిఫికేషన్ ప్రకారం.. ఈ సరికొత్త 1.0 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ వెర్షన్ లీటరుకు ఏకంగా 19.41 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుంది. ఇప్పటివరకు కొత్త జనరేషన్ డస్టర్ సిరీస్‌లో ప్రకటించిన అన్ని వేరియంట్లలో కెల్లా ఇదే అత్యంత ఎక్కువ మైలేజ్ ఇచ్చే కారు కావడం విశేషం.
మైలేజ్ పరంగా చూస్తే, ఈ చిన్న 1.0 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్.. డస్టర్‌లోని పెద్దదైన 1.3 లీటర్ టర్బోచార్జ్డ్ యూనిట్ కంటే చాలా మెరుగైన ప్రదర్శన కనబరిచింది. పోలిక కోసం చూసుకుంటే, డస్టర్ 1.3 లీటర్ మాన్యువల్ వేరియంట్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.