భారతదేశం, జూన్ 7 -- భారత ఆటోమొబైల్ మార్కెట్​లో ఒకప్పుడు కాంపాక్ట్ ఎస్‌యూవీ ట్రెండ్‌కు ఊపిరి పోసిన మోడల్ 'రెనాల్ట్ డస్టర్' ఇప్పుడు సరికొత్తగా రీ-ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు.. డస్టర్ టర్బో టీసీఈ 100 మోడల్‌కు సంబంధించిన అధికారిక మైలేజ్ వివరాలను కంపెనీ వెల్లడించింది. ఏఆర్ఏఐ సర్టిఫికేషన్ ప్రకారం.. ఈ సరికొత్త 1.0 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ వెర్షన్ లీటరుకు ఏకంగా 19.41 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుంది. ఇప్పటివరకు కొత్త జనరేషన్ డస్టర్ సిరీస్‌లో ప్రకటించిన అన్ని వేరియంట్లలో కెల్లా ఇదే అత్యంత ఎక్కువ మైలేజ్ ఇచ్చే కారు కావడం విశేషం.

మైలేజ్ పరంగా చూస్తే, ఈ చిన్న 1.0 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్.. డస్టర్‌లోని పెద్దదైన 1.3 లీటర్ టర్బోచార్జ్డ్ యూనిట్ కంటే చాలా మెరుగైన ప్రదర్శన కనబరిచింది. పోలిక కోసం చూసుకుంటే, డస్టర్ 1.3 లీటర్ మాన్యువల్ వేరియంట్...