భారతదేశం, నవంబర్ 6 -- Regina Cassandra About Heartbreak And Betrayal: తెలుగు, తమిళంలో హీరోయిన్‌గా మంచి క్రేజ్ తెచ్చుకున్న బ్యూటిఫుల్ హీరోయిన్ రెజీనా కసాండ్రా. తాజాగా రెజీనా తన వ్యక్తిగత జీవితంపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

గ్లామరస్ పాత్రలతో పాటు విభిన్నమైన కథాంశాలను ఎంచుకుంటూ సౌత్ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ, ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను బయటపెట్టారు. ప్రేమ పేరిట జరిగిన మోసం, దానివల్ల అనుభవించిన నరకాన్ని గుండెవిప్పి చెప్పారు.

తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన కఠిన పరిస్థితుల గురించి రెజీనా మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. "2020లో నా ప్రేమ బంధం ముగిసింది. ఆ బంధంలో నేను దారుణంగా మోసపోయాను. నమ్మిన మనిషే వెన్నుపోటు పొడవడంతో మనసంతా ముక్కలైపోయింది" ...