భారతదేశం, మే 22 -- Choreographer Geeta Kapur On Reality Shows Are Scripted: టీవీ రియాలిటీ షోలలో కంటెస్టెంట్లు కార్చే కన్నీళ్లు, వారి వెనుక ఉండే కష్టాల కథలు అన్నీ అబద్ధమేనా? కేవలం రేటింగుల కోసమే ఛానెళ్లు డ్రామాలు ఆడుతున్నాయా? సోషల్ మీడియా వేదికగా తరచూ వినిపించే ఈ ఆరోపణలపై బాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్, ప్రముఖ రియాలిటీ షో జడ్జ్ గీతా కపూర్ (గీతా మా) తీవ్రంగా స్పందించారు.

విమర్శలు చేసేవారు ఒకసారి షో సెట్స్‌కు వచ్చి చూస్తేనే అసలు సత్యం ఏంటో తెలుస్తుందని సవాల్ విసిరారు. మన తెలుగు టెలివిజన్ రంగంలోనూ 'ఢీ', 'డాన్స్ ప్లస్' లేదా 'బిగ్ బాస్' వంటి షోల విషయంలో ప్రేక్షకులు తరచూ ఇలాంటి సందేహాలే వ్యక్తం చేస్తుంటారు. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో ఒక టాప్ కొరియోగ్రాఫర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వినోద పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారాయి.

హిందుస్థాన్ టైమ్స్‌కు ఇచ్చి...