భారతదేశం, మే 26 -- RCB vs GT qualifier 1 2026 : ఇండియన్ ప్రీమియర్​ లీగ్ (ఐపీఎల్) 2026 ముగింపు దశకు చేరుకుంది. లీగ్ స్టేజ్‌లో అద్భుత ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో టాప్-2 లో నిలిచిన అత్యంత బలమైన జట్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), గుజరాత్ టైటాన్స్ (జీటీ).. నేడు (మంగళవారం) జరగనున్న ప్రతిష్టాత్మక 'క్వాలిఫైయర్ 1' పోరులో తలపడనున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల క్రికెట్ స్టేడియం వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది, ఓడిపోయిన జట్టుకు క్వాలిఫైయర్ 2 రూపంలో మరో అవకాశం ఉంటుంది.

ఐపీఎల్‌లో ప్లేఆఫ్స్ ఫార్మాట్ వచ్చాక టాప్-2 లో నిలిచిన జట్లకు ఫైనల్ చేరడానికి రెండు అవకాశాలు ఉంటాయి. అయితే, ఈ రోజే మ్యాచ్ గెలిచి ఎలాంటి టెన్షన్ లేకుండా నేరుగా ఐపీఎల్​ 2026 ఫైనల్ బెర్త్ ఖరారు చేసుక...