భారతదేశం, నవంబర్ 1 -- Sukumar Wife Tabitha Post On RC17 Launch: తెలుగు చిత్రసీమలో సరికొత్త చరిత్ర సృష్టించిన 'రంగస్థలం' లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతోంది. వీరి కలయికలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం #RC17 (వర్కింగ్ టైటిల్) ఇవాళ ఆదివారం (నవంబర్ 1) హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభమైంది.

'పుష్ప' సిరీస్‌తో పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన సుకుమార్ ఈ ప్రాజెక్ట్ కోసం మళ్లీ రామ్ చరణ్‌తో చేతులు కలపడంతో అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో జరిగిన ఈ లాంచ్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

దేవుడి పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కు చిరంజీవి క్లాప్ కొట్టి మూవీ టీమ్‌కి శుభాకాంక్షలు తెలిపారు. స్టార్ సిన...