భారతదేశం, అక్టోబర్ 25 -- Vishwak Sen Released Rayavalasa Second Song: తెలుగు సినిమా ప్రచార శైలి మునుపటిలా లేదు. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా వినూత్న ఆలోచనలతో చిత్రబృందాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న 'రాయవలస' చిత్రం టాలీవుడ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

డెబ్యూ హీరో కార్తీక్ జయంతి, నూతన దర్శకురాలు రాధిక జయంతి తల్లికొడుకుల కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ రాయవలస సినిమా ప్రమోషన్ల విషయంలో అంతర్జాతీయ స్థాయిలో హంగామా సృష్టిస్తోంది.

రాయవలస సినిమా ప్రచారంలో భాగంగా రెండో పాటను మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఇటీవల విడుదల చేశారు. 'మా ఊరు రాయవలస' అంటూ సాగే ఈ గ్రామీణ గీతాన్ని ఆస్కార్ అవార్డు గెలుచుకున్న 'నాటు నాటు' పాటను ఆలపించిన ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ అద్భుతంగా ఆలపించారు. అర్...