భారతదేశం, మే 9 -- Akash Jagannadh Speech Rayavalasa Teaser Launch Event: కార్తీక్ జయంతి హీరోగా పరిచయం అవుతున్న సినిమా రాయవలస. ఈ సినిమాను రాయసన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రాన్ని గోపీ కృష్ణ జె నిర్మించారు. రాయవలస సినిమాకు మహిళా దర్శకురాలు రాధిక జయంతి దర్శకత్వం వహించారు. కార్తీక్ జయంతి తల్లి అయిన రాధిక జయంతి ఈ సినిమాకు దర్శకత్వం వహించడం విశేషం.

లవ్ టైడ్ బై ఫేట్ (Love Tied by Fate) అనేది ట్యాగ్‌లైన్. ఇటీవల విడుదలైన రాయవలస ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఇవాళ (మే 8) రాయవలస టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. యంగ్ హీరో ఆకాష్ జగన్నాథ్ ఈ వేడుకకు హాజరయ్యారు. అనంతరం రాయవలస టీజర్ లాంచ్ ఈవెంట్‌లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు ఆకాష్ జగన్నాథ్.

ఆకాష్ జగన్నాథ్ మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. ఈ వేడుకకు రావడం చాలా ఆన...