భారతదేశం, ఆగస్టు 4 -- Telangana Ration Card Name Addition : ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందాలన్నా, సబ్సిడీ రేషన్‌ అందుకోవాలన్నా ప్రతి కుటుంబానికి రేషన్ కార్డే ప్రామాణికం. అయితే వివాహమైన తర్వాత భార్య పేరును లేదా కొత్తగా పుట్టిన పిల్లల పేర్లను రేషన్ కార్డులో చేర్చడం చాలా మందికి అవసరం అవుతుంది. ఈ ప్రక్రియ చాలా సులభం. సరైన పత్రాలు ఉంటే మీసేవ కేంద్రం ద్వారా లేదా ఆన్‌లైన్ విధానంలో సులభంగా పేర్లను చేర్చుకోవచ్చు.

రేషన్ కార్డులో కొత్తగా పేర్లను చేర్చడానికి పౌర సరఫరాల శాఖ కొన్ని ముఖ్యమైన పత్రాలను నిర్దేశించింది. భార్య పేరు చేర్చాలనుకుంటే.. భార్యకు సంబంధించిన ఆధార్ కార్డుతో పాటు అధికారికంగా జారీ చేసిన వివాహ ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా జత చేయాలి. కొత్తగా జన్మించిన పిల్లల పేర్లను రేషన్ కార్డులో చేర్చడానికి వారి మున్సిపాలిటీ లేదా గ్రామ పంచాయతీ జారీ చేసిన...