భారతదేశం, ఆగస్టు 5 -- చాలామంది తరుచూ తమ రేషన్ కార్డులను పోగొట్టుకోవడం లేదా పాడుచేసుకోవడం వల్ల ఇబ్బంది పడుతుంటారు. ఒకవేళ మీరు మీ రేషన్ కార్డును పోగొట్టుకున్నట్లయితే.. కేవలం మీ దగ్గర నెంబర్ ఉంటే వెంటనే డిజిటల్ కాపీని మీ స్మార్ట్‌ఫోన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిజిటల్ రేషన్ కార్డును ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చో చూడండి.

ప్రభుత్వం అందిస్తున్న ఈ డిజిటల్ సేవతో, మీ రేషన్ కార్డు ఇ-కాపీని పొందడం గతంలో కంటే చాలా సులభం, వేగవంతం అయింది. ఈ డిజిటల్ కాపీని మీరు అవసరం ఉన్న దగ్గర చూపించవచ్చు. అవసరమైతే రేషన్ షాపులో రేషన్ పొందడానికి దీనిని ఉపయోగించవచ్చు. ఆ సులభమైన పద్ధతి ఎలాగో చూడండి.

గూగుల్ ప్లే స్టోర్ నుండి మేరా రేషన్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి.

మీకు నచ్చిన భాషను ఎంచుకుని, ఆధార్ నంబర్, ఓటీపీ ఉపయోగించి లాగిన్ అవ్వండి.

మీ రేషన్ కార్డును రక్షించుకోవడానికి...