భారతదేశం, మార్చి 21 -- రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో అంగరంగ వైభవంగా జరిగిన వివాహ వేడుకల అనంతరం, టాలీవుడ్ సెన్సేషనల్ జంట విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నా తమ మధుర క్షణాలను ఆస్వాదించేందుకు థాయ్‌లాండ్ చెక్కేశారు. థాయ్‌లాండ్‌ తీరంలోని కో సముయి (Koh Samui) ద్వీపంలో ఈ కొత్త జంట ప్రస్తుతం సేద తీరుతోంది. తాజాగా విజయ్ రష్మిక హనీమూన్ ట్రిప్‌కు సంబంధించిన ఒక రొమాంటిక్ ఫోటో బయటకు రావడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు.

సాధారణంగా సెలబ్రిటీలు లగ్జరీ రిసార్ట్‌లను ఎంచుకుంటారు. కానీ, విజయ్, రష్మిక మాత్రం అందుకు భిన్నంగా ఒక ప్రైవేట్ ఎయిర్ బీఎన్‌బీ (Airbnb) విల్లాను ఎంచుకున్నారు. సముద్రపు ఒడ్డున, పచ్చని చెట్ల మధ్య ఉన్న ఈ విశాలమైన విల్లాలో విరోష్ ఏకాంతంగా గడుపుతున్నారు.

విజయ్ దేవరకొండను రష్మిక రొమాంటిక్‌గా హగ్ చేసుకున్న ఫొటోను నెట్టింట్లో షేర్ చేశారు. ఈ వైరల్ అవుత...