భారతదేశం, మే 30 -- Shahid Kapoor Mimics Rashmika Mandanna Cocktail 2: బాలీవుడ్‌లో 2012 కాలంలో సైఫ్ అలీ ఖాన్, దీపికా పదుకొణె, డయానా పెంటీ కాంబినేషన్‌లో వచ్చి యూత్‌ను విపరీతంగా ఆకట్టుకున్న రోమాంటిక్ డ్రామా 'కాక్‌టేయిల్'. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా 'కాక్‌టేయిల్ 2' (Cocktail 2) ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది.

హోమీ అదజానియా దర్శకత్వం వహిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో షాహిద్ కపూర్, కృతి సనన్ లీడ్ రోల్స్ చేస్తుండగా, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కీలక పాత్ర పోషిస్తోంది. జూన్ 19న థియేటర్లలోకి విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ ముంబైలో జోరుగా సాగుతున్నాయి.

అయితే కాక్‌టేయిల్ 2 సినిమా విడుదలకంటే ముందే షాహిద్ కపూర్, రష్మికల మధ్య జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కొద్దిరోజుల క్రితం జరిగిన ఈ కాక్‌టేయిల్ 2 మ్యూజిక...