భారతదేశం, నవంబర్ 23 -- Bigg Boss Mukesh Gowda Senior To Rashmika Mandanna: బుల్లితెర అతిపెద్ద రియాలిటీ షో 'బిగ్ బాస్ తెలుగు 10' ఆదివారం (నవంబర్ 22) నాటి ఎపిసోడ్‌లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. తన తదుపరి చిత్రం 'మైసా' ప్రచార కార్యక్రమాల్లో భాగంగా స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా బిగ్ బాస్ 10 తెలుగు షోకు విచ్చేశారు.

హోస్ట్ అక్కినేని నాగార్జునతో కలిసి హౌస్‌మేట్స్‌తో సరదాగా ముచ్చటించిన రష్మికకు, కంటెస్టెంట్, సీరియల్ హీరో ముఖేష్ గౌడ రూపంలో ఊహించని సర్‌ప్రైజ్ ఎదురైంది. తెలుగు ప్రేక్షకులకు 'గుప్పెడంత మనసు' సీరియల్‌లో రిషి సర్‌గా సుపరిచితుడైన ముఖేష్ గౌడ, నిజ జీవితంలో రష్మికకు కాలేజీ సీనియర్ అనే విషయం బయటపడటంతో హౌస్‌మేట్స్ అంతా ఆశ్చర్యపోయారు.

ఆదివారం ఎపిసోడ్‌లో నాగార్జున హౌస్‌మేట్స్ అందరికీ రష్మికను పరిచయం చేశారు. ఈ క్రమంలో ముఖేష్ గౌడ వైపు తి...