భారతదేశం, మే 14 -- Randeep Hooda On Shooting Set Leaks: ఒక సినిమాను తెరకెక్కించడానికి దర్శకులు, నిర్మాతలు ఏళ్ల తరబడి కష్టపడతారు. నటీనటుల లుక్స్ నుంచి లొకేషన్ల వరకు ప్రతిదీ రహస్యంగా ఉంచాలని భావిస్తారు. కానీ, ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా పుణ్యమా అని షూటింగ్ మొదలైన కొన్ని రోజులకే సెట్స్ నుంచి ఫోటోలు బయటకు వచ్చేస్తున్నాయి.

రణ్‌బీర్ కపూర్ 'రామాయణ' నుంచి షారుఖ్ ఖాన్ 'కింగ్' వరకు దాదాపు అన్ని భారీ ప్రాజెక్ట్ సినిమాలు ఈ లీకుల బెడదను ఎదుర్కొన్నాయి. తాజాగా బాలీవుడ్ హీరో రణదీప్ హుడా నటించిన ఓటీటీ సిరీస్'ఇన్‌స్పెక్టర్ అవినాష్ సీజన్ 2' కూడా ఇదే సమస్యను చవిచూసింది.

అయితే, ఈ లీకులపై రణదీప్ హుడా స్పందిస్తూ విభిన్నమైన వాదనను వినిపించారు. "షూటింగ్ సెట్స్ నుంచి సీన్లు లీక్ అవడం చాలా విషాదకరం. కానీ వాటిలో లీకులన్నీ ప్రమాదవశాత్తు జరుగుతాయని నేను అనుకోను. వీటి...