భారతదేశం, మే 22 -- Ranbir Kapoor Vastu Building Lease And Rent: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో ఒక సంచలన డీల్ కుదుర్చుకున్నారు. ముంబైలోని అత్యంత విలాసవంతమైన ప్రాంతమైన బాంద్రా వెస్ట్‌, పాలి హిల్‌లో ఉన్న తన పాత అపార్ట్‌మెంట్‌ 'వాస్తు'ను ఆయన లీజుకు ఇచ్చారు. ఈ ఫ్లాట్‌కు నెలకు ఏకంగా రూ. 11 లక్షల అద్దె లభించనుంది.

రియల్ ఎస్టేట్ డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ ద్వారా ఈ ఆసక్తికరమైన వివరాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం ముంబైలో సెలబ్రిటీల ఇళ్లకు ఉన్న డిమాండ్‌ను ఈ ఒప్పందం మరోసారి నిరూపించింది. 'వాస్తు' బిల్డింగ్‌లోని ఏడో అంతస్తులో ఉన్న ఈ లగ్జరీ ఫ్లాట్ 2,460 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. దీనిని రామాయణం హీరో రణ్‌బీర్ కపూర్ 2016లో రూ. 35 కోట్లకు కొనుగోలు చేశారు.

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ భార్య, ప్రముఖ ఇంటీరియర్ డి...