భారతదేశం, నవంబర్ 9 -- Ranabaali OTT Streaming Official Announcement: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించిన భారీ పీరియాడిక్ యాక్షన్ చిత్రం రణబాలి ఓటీటీలోకి వచ్చేందుకు ముహూర్తం ఖరారైంది. థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల వ్యవధిలోనే రణబాలి ఓటీటీ వేదికపైకి వస్తోంది.

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ విషయాన్ని ఇవాళ నవంబర్ 9న అధికారికంగా వెల్లడించింది. నవంబర్ 13 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో రణబాలి ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నట్లు పేర్కొంది. "సింగనమల బొబ్బిలి రణబాలి వస్తున్నాడు" అంటూ నెట్‌ఫ్లిక్స్ ఇండియా సోషల్ మీడియా వేదికగా రణబాలి ఓటీటీ రిలీజ్ డేట్‌ను ప్రకటించింది.

విజయ్ దేవరకొండ, రష్మికల మాస్ పోస్టర్‌ను పంచుకుంటూ అభిమానుల్లో ఆసక్తిని పెంచే ప్రయత్నం చేసింది. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీ...