భారతదేశం, అక్టోబర్ 17 -- Ranabaali 1st Day Worldwide Box Office Collection: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా కాంబినేషన్‌లో భారీ అంచనాల మధ్య విడుదలైన పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'రణబాలి' థియేటర్లలో నిన్న అక్టోబర్ 16న అడుగుపెట్టింది. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన మూటగట్టుకుంది. గడిచిన కొన్నేళ్లుగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న విజయ్ దేవరకొండకు ఈ సినిమా విజయం అత్యంత కీలకంగా మారింది.

ట్రేడ్ నివేదికల ప్రకారం 'రణబాలి' చిత్రం భారతదేశంలో తొలిరోజు దాదాపు రూ. 9.25 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. టాక్ సాధారణంగా ఉండటంతో తొలిరోజు వసూళ్లు మరీ ఆశాజనకంగా ఏమీ లేవు. విజయ్ దేవరకొండ కెరీర్‌లో ఇప్పటివరకు అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన 'లైగర్' (రూ. 15.95 కోట్లు) రికార్డును ఈ సినిమా దాటలేకపోయింది.

గత ఏడాది వచ...