భారతదేశం, సెప్టెంబర్ 4 -- Ramba Oorvasi Menaka Review And Rating In Telugu: నటులకు వరుస ప్లాపులు ఎదురైనప్పుడు లేదా విభిన్న ప్రయోగాలు అనుకున్న స్థాయిలో వర్కవుట్ కానప్పుడు మళ్లీ తమ పాత సేఫ్ జోన్‌లోకి వెళ్లడం పరిశ్రమలో సహజమే.

'నాంది', 'ఉగ్రం' వంటి తీవ్రమైన సీరియస్ సినిమాల తర్వాత అల్లరి నరేష్ మళ్లీ తనకు బలమైన అవుట్ అండ్ అవుట్ కామెడీ జోనర్‌లోకి అడుగుపెట్టారు. 90ల నాటి బ్లాక్‌బస్టర్ 'యమలీల' ఫార్ములాను ఆధునిక కాలానికి తగినట్లు మార్చి రూపుదిద్దిన సోషియో ఫాంటసీ కామెడీ చిత్రమే 'రంభ ఊర్వశి మేనక'.

ఈ సినిమాకు చంద్ర మోహన్ చింతడ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో అల్లరి నరేష్‌కు జోడీగా హీరోయిన్ సురభి యాక్ట్ చేసింది. మరో ముగ్గురు ముద్దుగుమ్మలు రాశి సింగ్, యాంకర్ విష్ణుప్రియ, ప్రిషా సింగ్ కూడా హీరోయిన్లుగా నటించారు. ఇవాళ (సెప్టెంబర్ 4) థియేటర్లలో విడుదలైన ఈ స...