భారతదేశం, జూలై 30 -- Ramayana Trailer: భారతీయ చలనచిత్ర చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో, గ్లోబల్ విజువల్ ప్రమాణాలతో తెరకెక్కుతున్న చిత్రం 'రామాయణ' (Ramayana). 'దంగల్' ఫేమ్ నితేష్ తివారీ దర్శకత్వంలో ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ అధినేత నమిత్ మల్హోత్రా నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న ఈ పౌరాణిక మహాకావ్యం మొదటి భాగం (Part 1) కి సంబంధించిన ట్రైలర్‌ను బ్రహ్మముహూర్తాన మేకర్స్ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు.

అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురు చూసిన రామాయణ ట్రైలర్ వచ్చేసింది. ఇవాళ (జూలై 30) బ్రహ్మ ముమూర్తంలో ఈ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. గతంలో వచ్చిన టీజర్‌పై వచ్చిన విమర్శలను పరిగణనలోకి తీసుకుని, అత్యున్నత క్వాలిటీతో కట్ చేసిన ఈ ట్రైలర్ సినీ ప్రియులకు గూస్‌బంప్స్ తెప్పిస్తోంది.

ట్రైలర్ ప్రారంభంలోనే రావణాసురుడు (యష్) ఒక రాజభవన ద్వారాన్ని తట్టి, భయాందోళనల మధ్య "ఇది...