భారతదేశం, జూలై 12 -- Mahesh Babu Jr NTR Ramayana Trailer: బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న 'రామాయణం: పార్ట్ 1' చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, కన్నడ స్టార్ యశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా అధికారిక ట్రైలర్ జూలై 24న విడుదల కానుంది.

ఈ లోపే సోషల్ మీడియాలో ఒక వినూత్న ప్రయోగం సంచలనం సృష్టిస్తోంది. అసలు రామాయణ ట్రైలర్ కోసం ఆగలేకపోయిన టాలీవుడ్ అభిమానులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో తెలుగు స్టార్ హీరోలను పెట్టి ఒక కొత్త అద్భుతమైన ఫ్యాన్ మేడ్ రామాయణ ట్రైలర్‌ను రూపొందించారు.

'సనాతని సిద్ధాంత' అనే యూట్యూబ్ ఛానల్ రూపొందించిన ఈ రామాయణ ఏఐ ట్రైలర్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇందులో రాముడి పాత్రలో సూపర్‌స్టార్ మహేశ్ బాబు, సీతగా కీర్తి సురేష్, లంకే...