భారతదేశం, నవంబర్ 10 -- Ramayana 5 Days Worldwide Collection: భారతీయ చిత్రసీమలో మరో సంచలనం నమోదైంది. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు నితేష్ తివారీ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన దృశ్య కావ్య చిత్రం 'రామాయణం' బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా దక్షిణాది భామ సాయి పల్లవి, రావణాసురుడిగా రాకింగ్ స్టార్ యశ్ నటించిన ఈ సినిమా ఐదో రోజైన సోమవారం (నవంబర్ 9) రికార్డులను తిరగరాసింది. దివాళీ పండుగ సెలవుల కంటిన్యూటీని పక్కాగా వాడుకుంటూ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర దండయాత్ర చేసింది.

నవంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన రామాయణం సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 128 కోట్ల గ్రాస్ వసూలు చేసి మంచి బోణీ కొట్టింది. నాలుగు రోజుల ఓపెనింగ్ వీకెండ్ ముగిసేసరికి ప్రపంచవ్యాప్తంగా రూ. 500 కోట్ల మార్కును అందుకంది.

దాదాపు రూ. 1600 కోట్ల న...