భారతదేశం, ఆగస్టు 13 -- Ramayana: ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న డ్రీమ్ ప్రాజెక్ట్ మూవీ 'రామాయణ' (Ramayana). నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ పౌరాణిక కావ్యంలో శ్రీరాముడిగా రణబీర్ కపూర్, సీతాదేవిగా సాయి పల్లవి, రావణాసురుడిగా కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్నారు. ఇప్పటికే రెండు భాగాలుగా ప్లాన్ చేసిన ఈ సినిమా నుంచి ఏ చిన్న వార్త బయటకు వచ్చినా నెట్టింట క్షణాల్లో వైరల్ అవుతోంది.

ఈ క్రమంలో రామాయణ సినిమా గురించి నటుడు చేతన్ హన్స్ రాజ్ (Chetan Hansraj) ఒక ఇంటర్వ్యూలో సంచలన విషయాలు పంచుకున్నారు. ఈ పౌరాణిక చిత్రంలో తాను ఏకంగా ఏడు విభిన్నమైన క్యారెక్టర్లలో అలరించబోతున్నానని, ఇది తన కెరీర్‌లోనే అత్యంత అరుదైన మైలురాయి వంటి అనుభవమని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

రామాయణ సినిమాలో చేతన్ హన్స్ రాజ్ పోషిస్తున్న పాత్రల వి...