భారతదేశం, అక్టోబర్ 7 -- ఆశ్వయుజ మాసాన ఉయ్యాలో

ఆకసాన వెన్నెలలు ఉయ్యాలో

తెలంగాణ పోరునేల ఉయ్యాలో

పండుగై మెరిసెనుగా ఉయ్యాలో!

గుమ్మడి పూలల్లా ఉయ్యాలో

తంగేడు తంగుల్లో ఉయ్యాలో

పట్టుకుచ్చుల విరులు ఉయ్యాలో

తల్లీ నిను కొలిచెదము ఉయ్యాలో!

రామ రామ ఉయ్యాలో

రామచంద్ర ఉయ్యాలో

సీతామహాదేవి ఉయ్యాలో

శ్రీరాముని తోడూగా ఉయ్యాలో!

వాగులు వంకల్లో ఉయ్యాలో

పారేటి జలకాన ఉయ్యాలో

గౌరమ్మను నిలిపితిమి ఉయ్యాలో

పసుపుకుంకుమల తోటి ఉయ్యాలో!

అక్కా చెల్లెండ్లంతా ఉయ్యాలో

ఒక్కటై వచ్చిరిగా ఉయ్యాలో

పట్టుచీరల వెలుగు ఉయ్యాలో

ముంగిట్లో కదలాడే ఉయ్యాలో!

చుట్టూ తిరుగుతు ఉయ్యాలో

చప్పట్ల తాళాన ఉయ్యాలో

పాటల పూదోట ఉయ్యాలో

పరవశించి పాడంగ ఉయ్యాలో!

పాలపిట్ట కూతలతో ఉయ్యాలో

చేలల్లో పసిడి పంట ఉయ్యాలో

మా యిండ్ల సిరులన్నీ ఉయ్యాలో

మెండుగా నింపవమ్మ ఉయ్యాలో!

సాంబ్రాణి ధూపాన ఉ...