భారతదేశం, మే 19 -- Ram Charan On Salman Khan Sultan Aamir Khan Dangal: 'ఆర్ఆర్ఆర్' సినిమాతో అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్, ఇప్పుడు సరికొత్త స్పోర్ట్స్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ముంబైలో సోమవారం (మే 18) జరిగిన 'పెద్ది' ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో రామ్ చరణ్ హిందీ చిత్ర పరిశ్రమకు చెందిన ఇద్దరు స్టార్ హీరోలపై ప్రశంసల జల్లు కురిపించారు.

"సుల్తాన్, దంగల్ వంటి చిత్రాలతో మాకు సరికొత్త బాట చూపించిన సల్మాన్ ఖాన్ సర్, అమీర్ ఖాన్ సర్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఆ సినిమాలు మా లాంటి మేకర్స్‌లో ఎంతో నమ్మకాన్ని నింపాయి. భారతీయ సినిమా హిస్టరీలో ఇలాంటి విభిన్నమైన క్రీడా నేపథ్య కథలు గతంలో అద్భుతంగా వర్కవుట్ అయ్యాయి. మేము కూడా అదే నమ్మకంతో, అదే దారిలో ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టాం" అని రామ్ చరణ్ పేర్కొన్నారు.

పెద్ది సినిమాకు దంగల్, సుల్తా...