భారతదేశం, మే 22 -- Rajya Sabha Elections Schedule 2026 : దేశవ్యాప్తంగా ఖాళీ అవుతున్న ఎగువ సభ(రాజ్యసభ) స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. 10 రాష్ట్రాల పరిధిలోని మొత్తం 24 రాజ్యసభ స్థానాలకు జూన్ 18వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

పలువురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం జూన్ 21 నుండి జూలై 19 మధ్య వేర్వేరు తేదీల్లో ముగియనుండటంతో.. ఈ ఖాళీలను భర్తీ చేసేందుకు ఈసీ ఈ మేరకు కసరత్తు పూర్తి చేసి షెడ్యూల్‌ను ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ సహా పలు కీలక రాష్ట్రాల్లో ఈ ఎన్నికలు జరగనుండటంతో రాజకీయ వర్గాల్లో ఇప్పుడే సందడి మొదలైంది.

కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించిన వివరాల ప్రకారం.. మొత్తం 10 రాష్ట్రాల్లోని 24 రాజ్యసభ స్థానాలకు ఈ పోలింగ్ జరగనుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల నుంచి అత్యధికంగా నాలుగు చొప్ప...