భారతదేశం, అక్టోబర్ 25 -- Rajinikanth Watch Jailer 2 With Fans After 40 Years: బాక్సాఫీస్ వద్ద 'తలైవర్' రజనీకాంత్ జాతర కొనసాగుతోంది. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్‌టైనర్ 'జైలర్ 2' దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి థియేటర్లలో సునామీ సృష్టిస్తోంది.

టైగర్ ముత్తువేల్ పాండియన్‌గా రజనీకాంత్ మరోసారి తన మార్క్ మేనియాతో థియేటర్లను ఊపేస్తున్నారు. విడుదలైన మొదటి వారంలోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 500 కోట్ల కలెక్షన్స్ దాటిన ఈ సినిమా, ప్రస్తుతం రూ.600 కోట్ల క్లబ్‌లో ఘనంగా అడుగుపెట్టింది.

తెలుగు రాష్ట్రాల్లోనూ 'జైలర్ 2' హవా స్పష్టంగా కనిపిస్తోంది. రాయలసీమ నుంచి కోస్తా, తెలంగాణ వరకు థియేటర్లు హౌస్‌ఫుల్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. జైలర్ 2 సినిమాను చూసేందుకు రజనీకాంత్ స్వయంగా థియేటర్‌కు రావడం, అభిమానుల కోలాహలం మధ్...