భారతదేశం, జూలై 26 -- Rajinikanth Biopic Movie Life Story Written: బెంగళూరు వీధుల్లో బస్ కండక్టర్‌గా ప్రయాణం ప్రారంభించి, దశాబ్దాల పాటు భారతీయ సినీ రంగాన్ని శాసించిన ఏకైక సూపర్ స్టార్ రజనీకాంత్. కోట్లాది మంది అభిమానులకు ఆరాధ్యదైవంగా మారిన తలైవా తన జీవిత కథను ఆత్మకథగా రూపొందిస్తున్నారు.

ఇప్పుడు ఈ సంచలన ఆత్మకథ ఆధారంగా ఒక భారీ బయోపిక్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తమిళ చిత్రసీమలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోనూ రజనీకాంత్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.

'పెదరాయుడు', 'ముత్తు', 'బాషా', 'శివాజీ', 'రోబో' నుంచి ఇటీవల వచ్చిన 'జైలర్' వరకు ఆయన ప్రతి సినిమా తెలుగు బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించింది. ఈ నేపథ్యంలో రజనీకాంత్ జీవితంలో వెలుగుచూడని ఆసక్తికర కోణాలను, ఎదుర్కొన్...