భారతదేశం, మే 3 -- రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం(మే 3), సోమవారం(మే 4) తేదీల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మే 5వ తేదీన కూడా కొన్ని జిల్లాల్లో వర్షం తీవ్రత ఎక్కువగా ఉండనుంది.

ఈ క్రింది జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు గంటకు 40 నుండి 50 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ ఈ జిల్లాల్లో వానలు ఎక్కువగా పడనున్నాయి. మిగతా జిల్లాల్లో కూడా అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.

వచ్చే రెండు రోజుల పాటు ఎండలు ప్రస్తుత స్థాయిలోనే కొనసాగినప్పటికీ, ఆ తదుపరి మూడు రోజుల్లో వాతావరణం చల్లబడనుంది. గరిష్ట ఉ...