భారతదేశం, నవంబర్ 9 -- ఇప్పటివరకు సూపర్ ఫాస్ట్ కేటగిరీలో నడిచిన పలు రైళ్లను నాన్-సూపర్ ఫాస్ట్/సాధారణ ఎక్స్‌ప్రెస్ కేటగిరీలోకి మారుస్తూ రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మార్పులు 2027 జనవరి 1 నుండి అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికులు తమ ప్రయాణ ప్రణాళికను సిద్ధం చేసుకునే ముందు కొత్త ట్రైన్ నంబర్లను కూడా సరిచూసుకోవాలని రైల్వే శాఖ సూచించింది.

దక్షిణ కోస్తా రైల్వే పరిధిలో మారిన రైళ్ల వివరాలు అధికారులు వెల్లడించారు. 120807 (విశాఖపట్నం - అమృత్‌సర్) సూపర్‌ఫాస్ట్... 2027 జనవరి 1 నుంచి 18513 నెంబర్‌తో ఎక్స్‌ప్రెస్‌గా నడుస్తుంది. అలాగే 20808 (అమృత్‌సర్ - విశాఖపట్నం) రైలు.. 18514 నెంబర్‌తోపాటు ఎక్స్‌ప్రెస్‌మారింది.

22875 (విశాఖపట్నం - గుంటూరు) ఉదయ్ ఎక్స్‌ప్రెస్.. 18531 నెంబర్‌లో మారుతుంది. 22876(గుంటూరు - విశాఖపట్నం) ఉదయ్ ఎక్స్‌ప్రెస...