భారతదేశం, మే 3 -- Railway AI Assistant Bholu Mini Bholu Max : భారతీయ రైల్వే డిజిటల్ విప్లవం దిశగా మరో కీలక అడుగు వేసింది. ప్రయాణికులకు సమాచారాన్ని మరింత సులభంగా, వేగంగా అందించేందుకు అత్యాధునిక కృత్రిమ మేధ (AI) సాంకేతికతను పట్టాలెక్కించింది. ఇందులో భాగంగా తెలంగాణలోని మల్కాజిగిరి, కాచిగూడ రైల్వే స్టేషన్లలో 'భోలు మినీ' (Bholu Mini), 'భోలు మాక్స్' (Bholu Max) పేరుతో సరికొత్త ఏఐ రోబోటిక్ అసిస్టెంట్లను ప్రారంభించింది.

రైల్వే స్టేషన్ కు వెళ్లగానే ఏ ప్లాట్‌ఫారమ్ కు వెళ్లాలో తెలియక, రైలు ఏ సమయానికి వస్తుందో అర్థం కాక అయోమయానికి గురయ్యే ప్రయాణికులకు ఈ ఏఐ అసిస్టెంట్లు కావాల్సిన సమాచారాన్ని అందిస్తాయి. ఇవి కేవలం యంత్రాలు మాత్రమే కావు, ప్రయాణికులతో నేరుగా సంభాషిస్తాయి.

ఈ స్మార్ట్ అసిస్టెంట్లలో అత్యాధునిక టచ్ స్క్రీన్ సదుపాయంతో పాటు వాయిస్ కమాండ్ ఫీచ...