భారతదేశం, ఆగస్టు 13 -- Rahul Sipligunj: ఆస్కార్ విన్నింగ్ సాంగ్ 'నాటు నాటు' ఫేమ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ చుట్టూ ప్రస్తుతం ఓ తీవ్ర వివాదం చుట్టుముట్టింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశారంటూ ఒక మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదైన ఎఫ్ఐఆర్ (FIR)లో రాహుల్ సిప్లిగంజ్ పేరు రావడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వివాదంపై రాహుల్ స్పందిస్తూ అసలు నిజాలు బయటపెట్టారు.

విశాఖపట్నం ఎంవీపీ కాలనీ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఈ కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. కర్పురపు రాహుల్ రెడ్డి అనే వ్యక్తి బంబుల్ (Bumble) డేటింగ్ యాప్ ద్వారా సదరు బాధితురాలికి పరిచయమయ్యాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెతో సన్నిహితంగా ఉన్నాడని, ఆ తర్వాత ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు వచ్చి విడిపోవడానికి సిద్ధపడ్డారని సమాచారం.

ఈ క్రమంలోనే రాహుల్ రెడ్డి బంధువులైన రాహుల్ సిప్...