భారతదేశం, మే 13 -- Rahul Ramakrishna: ఓ వైపు కమెడియన్ గా కామెడీ పండిస్తూనే, మరోవైపు వివిధ క్యారెక్టర్లలో అదరగొడుతూ విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు రాహుల్ రామ‌కృష్ణ‌. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ నటుడు తాజాగా సంచలన ట్వీట్ చేశాడు. తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం ఎగ్జిబ్యూటర్ల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో రాహుల్ ట్వీట్ వైరల్ అవుతోంది.

సినిమా టికెట్ల రేట్ల విషయంలో, పర్సంటేజీ విషయంలో తెలుగు సినిమా ఎగ్జిబ్యూటర్లు అందరూ ఒక్కతాటిపైకి వచ్చారు. సినిమా టికెట్లు పెంచే అవకాశమే లేదని, అమ్మకాల్లో పర్సంటేజీ కావాలని డిస్ట్రిబ్యూటర్లు పట్టుబడుతున్నారు. ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.

టాలీవుడ్ లో ఎప్పటి నుంచో నైజాం, సీడెడ్, ఆంధ్ర అంటూ ప్రాంతాలను విభజించి సినిమా రైట్స్ కొంటున్నారు. అయితే ఇప్పటికీ నైజాం, సీడెడ్ అనే పేర్లతో ...