భారతదేశం, ఏప్రిల్ 25 -- Ragi Buttermilk Recipe: వేసవి కాలం వచ్చిందంటే చాలు భానుడి భగభగలకు శరీరం త్వరగా అలసిపోతుంది. డీహైడ్రేషన్, నీరసం వంటి సమస్యలు వేధిస్తుంటాయి. ఇలాంటి సమయంలో మార్కెట్లో దొరికే కృత్రిమ శీతల పానీయాల కంటే, మన సంప్రదాయ 'రాగి మజ్జిగ' తీసుకోవడం ఉత్తమమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. రాగి (మండ్య) లో ఉండే పోషకాలు, మజ్జిగలోని చలువ చేసే గుణం కలిసి శరీరానికి పూర్తిస్థాయి రక్షణను అందిస్తాయి.

రాగిలో కాల్షియం, ఐరన్ తో పాటు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది ఎముకల పుష్టికే కాకుండా రక్తహీనతను తగ్గించడానికి కూడా తోడ్పడుతుంది. మరోవైపు మజ్జిగ సహజ సిద్ధమైన ప్రోబయోటిక్‌గా పనిచేసి జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఈ రెండింటి కలయిక వల్ల శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉండటమే కాకుండా, హీట్ స్ట్రోక్ వంటి ముప్పుల నుంచి రక్షణ లభిస్తుంది.

రాగి మజ్జిగను నేరు...