భారతదేశం, మార్చి 15 -- పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన మోస్ట్ అవేటెడ్ మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్' విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో చిత్ర బృందం ప్రమోషన్లలో బిజీగా ఉంది. అయితే, ఈ సినిమా ప్రమోషన్ల కోసం ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో హీరోయిన్ రాశీ ఖన్నా చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

అయితే, రాశీ ఖన్నా కేవలం తన పాత్ర గురించి మాత్రమే కాకుండా, ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు, యుద్ధం వంటి విషయాలు సినిమా పరిశ్రమపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే అంశంపై చాలా లోతైన విశ్లేషణ చేశారు.

అమెరికా,ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల గురించి రాశీ ఖన్నా మాట్లాడుతూ.. "మనం ఒక యుద్ధ కాలంలో ఉన్నాం. దీనివల్ల భవిష్యత్తులో ద్రవ్యోల్బణం (ధరల పెరుగుదల) ఎంత దారుణంగా ఉండబోతుందో చాలామంది గ్రహించడం లేదు" అని తెలిపారు.

"నేను ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిని, ...