భారతదేశం, జూన్ 12 -- Raakh Web Series Review: ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లకు ఎప్పుడూ ఒక ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు వాస్తవ ఘటనల బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సరికొత్త వెబ్ సిరీస్ 'రాఖ్' (Raakh). 'పాతాళ్ లోక్' ఫేమ్ ప్రోసిత్ రాయ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సిరీస్‌లో అలీ ఫజల్, సోనాలి బింద్రే, ఆకాష్ మఖిజా కీ రోల్స్ ప్లే చేశారు. ఈరోజే అంటే జూన్ 12న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ వెబ్ సిరీస్ ఆడియన్స్ ను ఏ మేరకు థ్రిల్ చేసిందో చూద్దాం.

ప్రైమ్ వీడియో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రాఖ్ స్టోరీ విషయానికి వస్తే.. 1978వ సంవత్సరంలో ఢిల్లీని అతలాకుతలం చేసిన భయంకరమైన జంట హత్యల కేసు ఆధారంగా ఈ కథను రాసుకున్నారు. ఢిల్లీ కంటోన్మెంట్‌లో ఉండే లెఫ్టినెంట్ కల్నల్ అశోక్ అరోరా, మోనా అరోరా దంపతుల పిల్లలు సుమన్, సాహిల్ బయటకు వెళ్లి తిరిగి రాకపోవ...