భారతదేశం, జూన్ 24 -- Raakh Villains: ప్రైమ్ వీడియోలో రీసెంట్‌గా రిలీజైన ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'రాఖ్' (Raakh) ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై దూసుకుపోతోంది. ఈ సిరీస్‌లో విలన్లుగా నటించిన ఆకాష్ మఖీజా, రమణ్‌దీప్ యాదవ్ తమ పెర్ఫార్మెన్స్‌తో సోషల్ మీడియాలో విపరీతమైన నెగెటివిటీని అందుకున్నారు. ఆడియన్స్ వీళ్లను దారుణంగా అసహ్యించుకున్నారు. వారు పోషించిన బాబు, రజ్జో క్యారెక్టర్లపై జనాల్లో వచ్చిన ఈ రేంజ్ ద్వేషమే ఇప్పుడు వారి కెరీర్‌కు బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్‌గా మారింది.

ఈ ఇద్దరు యాక్టర్స్ ఊహించని విధంగా దేశంలోనే మోస్ట్ పాపులర్ నటులుగా అవతరించి సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. బుధవారం (జూన్ 24) ఐఎండీబీ (IMDb) వీరికి ప్రతిష్టాత్మకమైన 'బ్రేక్‌అవుట్ స్టార్' స్టార్‌మీటర్ అవార్డులను (IMDb Breakout Star STAR...