భారతదేశం, జూన్ 1 -- Raakh Trailer: డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌పై క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లకు ఎప్పుడూ మంచి క్రేజ్ ఉంటుంది. గ్రిప్పింగ్ స్టోరీలైన్, ఊహించని మలుపులు ఉంటే ఆడియన్స్ కచ్చితంగా ఆ కంటెంట్‌ను ఆదరిస్తారు. ఇప్పుడు సరిగ్గా అలాంటి అంచనాలతోనే 'రాఖ్' (Raakh) వెబ్ సిరీస్ ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

బాలీవుడ్ నటులు అలీ ఫజల్, సోనాలి బింద్రే ప్రధాన పాత్రల్లో నటించిన ఈ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ షో ట్రైలర్‌ను సోమవారం (జూన్ 1, 2026) మేకర్స్ అఫీషియల్‌గా రిలీజ్ చేశారు. ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ సిరీస్‌కు 'పాతాళ్ లోక్' సీజన్ 1 డైరెక్టర్ ప్రోసిత్ రాయ్ దర్శకత్వం వహించారు.

ఈ సిరీస్ కథ 1970ల కాలం నాటి ఢిల్లీ నేపథ్యంలో సాగుతుంది. నగరంలో వరుసగా పిల్లలు కిడ్నాప్, హత్యలకు అవుతుంటారు. అలా ఒకే ఇంటికి చెందిన ఇద్దరు పిల్లలు కూడా కనిపించకుండాప...