భారతదేశం, ఏప్రిల్ 13 -- Raakaasa Worldwide Box Office Collections: టాలీవుడ్ యంగ్ హీరో సంగీత్ శోభన్, హీరోయిన్ నయన్ సారిక జంటగా నటించిన లేటెస్ట్ మూవీ రాకాస. నిహారిక కొణిదెల నిర్మించిన హారర్ కామెడీ ఫాంటసీ మూవీ రాకాసకు మానస శర్మ దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 3న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది.

విడుద‌లైన‌ 10 రోజుల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా రాకాస రూ.22.60 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించిన‌ ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఇంకా త‌న స‌త్తాను చాటుతోంది. రిలీజైన రోజు నుంచి హిట్ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ సినిమాకు ఇంకా ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ కొన‌సాగుతుండ‌టం విశేషం. ఇది చూస్తుంటే ఈ స‌క్సెస్ జోరు మరింత‌గా కొన‌సాగుతుంద‌నే సంకేతాల‌ను సూచిస్తోంది.

ఈ విజ‌యానికి ప్రధాన కారణం థియేటర్లలో ప్రేక్షకుల నుంచి వ‌స్తోన్న స్పంద‌న‌. రాకాస‌ సినిమాను ప్రేక్ష‌కులు...